టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. మహేంద్రసింగ్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ జట్టు కెప్టెన్ కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగితే మరెన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. అత్యంత హుషారైన ఆటగాడిగా మహీ ఉండేవాడని, కెప్టెన్సీ బాధ్యతలు ఎప్పుడూ భారంగా అనుకోలేదని తెలిపాడు.
"ప్రపంచ క్రికెట్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. ధోనీ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. ఒకవేళ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి, సారథిగా వ్యవహరించకుండా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ పూర్తి భిన్నమైన మహీని చూసుండేది. బహుశా ధోనీ మరెన్నో రికార్డులు బద్దలు కొట్టేవాడు.