కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉండకుండా బయట తిరుగుతున్న కొందరిపై మండిపడ్డాడు భారత క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. ప్రభుత్వం సూచనల ప్రకారం నడుచుకోవాలని అన్నాడు. వీలైతే ఇంట్లో కుటుంబంతో కలిసి ఉండాలని, లేదంటే జైలుకు వెళ్లాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన వంతు సాయంగా వైద్య సేవల కోసం తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు దిల్లీ ప్రభుత్వానికి ఇచ్చాడు.
'ఇంట్లో ఉండండి లేదంటే జైలుకు వెళ్లండి'
క్వారంటైన్ నిబంధనలు అతిక్రమించి బయట తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తన వంతు సాయంగా విరాళమిచ్చాడు.
గౌతమ్ గంభీర్
"సమాజానికి హాని కలిగించొద్దు. మన జీవించేందుకు ప్రస్తుతం పోరాటం చేస్తున్నాం. కాబట్టి లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకోండి. క్వారంటైన్లో ఉండండి లేదంటే జైలుకు వెళ్లండి" -గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్-ఎంపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు, ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ పాల్గొన్నారు. అయితే ఇది ముగిసిన(రాత్రి 9 గంటల) తర్వాత కొన్నిచోట్ల ఎక్కువ మంది గుమిగూడారు.