తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొజికోడ్ ఘటన.. భారత క్రీడాలోకం విచారం - కేరళ విమాన ప్రమాదం

కొజికోడ్​లో జరిగిన విమాన ప్రమాదం చూసి భారత క్రీడాకారులు చలించిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

cricket fraternity expresses shock over Kozhikode plane crash
కొజికోడ్ ప్రమాదంపై క్రికెట్ లోకం విచారం

By

Published : Aug 8, 2020, 9:53 AM IST

Updated : Aug 8, 2020, 10:50 AM IST

కేరళ విమాన ప్రమాదంపై పలువురు భారత స్టార్ క్రికెటర్లు, మాజీలు విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది మృత్యువాత పడగా, 100 మందికిపైగా గాయపడ్డారు. విచారం వ్యక్తం చేసిన వారిలో టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ, దిగ్గజ సచిన్ తెందుల్కర్, మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, గంభీర్​త పాటు పలువురు ఉన్నారు.

"కొజికోడ్​ ఘటనలోని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమాదంలో తమ ప్రాణాలు వదిలిన వారికి ప్రగాఢ సానుభూతి" -భారత కెప్టెన్ కోహ్లీ

"కొజికోడ్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం" -సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్

"ప్రమాదంలో మృతి చెందిన పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" -ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్

'వందే భారత్' మిషన్​లో భాగంగా దుబాయ్​ నుంచి ఈ విమానం కేరళకు వచ్చింది. అయితే రన్​వేపై నీరు ఉండటం వల్ల అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు.

Last Updated : Aug 8, 2020, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details