ప్రతిసారి జరిగినట్లే ఎంతోమంది అనామక ప్రతిభావంతులు ఐపీఎల్ వేలంలోకి వచ్చారు. అందులో కొందరిని ఫ్రాంఛైజీలు కొనుక్కున్నాయి. అందులో ఓ కుర్రాడే దిగ్విజయ్ దేశ్‌ముఖ్. విశేషమేంటే అతడికి ఇంతకుముందే గుర్తింపుంది. కానీ క్రికెటర్‌గా కాదు.. నటుడిగా. 2013లో విడుదలైన హిందీ చిత్రం 'కై పో చే' లో అతడు బాలనటుడిగా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు.
క్రికెటర్‌గా తన నటనతో ఆకట్టుకున్న ఈ కుర్రాడిని.. గురువారం జరిగిన వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ముంబయి ఇండియన్స్ అతణ్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల దేశ్‌ముఖ్ ఆల్‌రౌండర్. మహారాష్ట్ర తరఫున ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.