ఐపీఎల్ 14 మెగా లీగ్ కోసం సన్నాహాలు జరుపుతోంది బీసీసీఐ పాలక మండలి. ఈ మేరకు ఫ్రాంచైజీలు... ఆటగాళ్లను అట్టిపెట్టుకునే పద్ధతిని జనవరి 20లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఫ్రాంచైజీల్లో భాగమవని భారత ఆటగాళ్లు తమ ఆసక్తి మేరకు వేలం అగ్రిమెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, ఫిబ్రవరి 4 లోగా పూర్తి చేయాలని తెలిపింది.
ఈ దరఖాస్తు ఒరిజినల్ పత్రాలను ఫిబ్రవరి 12లోపు కౌన్సిల్‌కు చేర్చాలని పాలక మండలి పేర్కొంది. పూర్తి వివరాలను బీసీసీఐ మధ్యంతర సీఈఓ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీఓఓ హేమంగ్ అమిన్ వివరించారు. ఇప్పటికే ఫ్రాంచైజీలతో కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇది వర్తించదని పేర్కొన్నారు. రాష్ట్ర క్రికెట్ కౌన్సిల్స్‌కు, బీసీసీఐకి దీనితో సంబంధం లేనట్లు తెలిపారు.