రష్యాలో జరుగుతున్న 'మగ్మద్ సలామ్ ఉమఖ్నోవ్ మెమోరియల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీ'లో భారత బాక్సర్లు మెరిశారు. మహిళా విభాగంలో స్టార్ బాక్సర్లు పూజా రాణి(75 కేజీలు), లవ్లీనా బోర్గేన్(69 కేజీలు), నీరజ్(57 కేజీలు), జానీ(60 కేజీలు) విభాగంలో రాణించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు.
రష్యాకు చెందిన సిగేవాపై 5-0 తేడాతో గెలిచి పతకాన్ని ఖరారు చేసింది లవ్లీనా. ఫైనల్లో చోటు కోసం తర్వాతి బౌట్లో అలినా వెర్బర్(బెలారస్)తో తలపడనుందీ బాక్సర్.