టెస్టుల నిడివిని 4 రోజులకు తగ్గించాలనే ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నాథన్ లియోన్, విరాట్ కోహ్లీ, మెక్‌గ్రాత్.. తాజాగా ఆ జాబితాలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలని, గంగూలీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపకూడదని తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు.
"బీసీసీఐ ఆమోదం లేకుండా ఐసీసీ ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదు. పాకిస్థాన్, శ్రీలంక, భారత్ ప్రజలు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గళం విప్పాలి. మా దేశంలోని దిగ్గజ క్రికెటర్లు ఈ అంశంపై వాళ్ల అభిప్రాయం వెల్లడించాలి." -షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్