ఐసీసీ ఛైర్మన్ కాలవ్యవధి త్వరలో పూర్తి కానుంది. ఇప్పుడు ఈ పదవి రేసులో మరో కొత్త పేరు ముందుకొచ్చింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కేమరూన్.. ఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. తాను ఎన్నికైతే క్రికెట్లో కొత్త మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
"నేను ఛైర్మన్ పదవికి ఎన్నికైతే.. స్థిరమైన ఆర్థిక విధానాన్ని తీసుకొస్తాను. తద్వారా అన్ని క్రికెట్ బోర్డులు ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రాచుర్యం పొందే దిశగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. క్రికెట్లో కొత్త విధివిధానాలు తీసుకొస్తాను. తక్కువ ఈవెంట్లు నిర్వహించి ఎక్కువ మొత్తంలో ఆర్జించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తాను"