తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దిల్లీ క్యాపిటల్స్​కు ఈసారీ అతడే ఎక్స్‌-ఫ్యాక్టర్!' - ఎక్స్‌-ఫ్యాక్టర్

దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్ రిషభ్​ పంత్​పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్​ పార్థివ్ పటేల్. ఈ సీజన్​లో దిల్లీ జట్టుకు అతడు ఎక్స్​-ఫ్యాక్టర్​గా మారతాడని తెలిపాడు. స్వతహాగా ప్రతిభాశాలి అని కొనియాడాడు.

Former Team India wicketkeeper Parthiv Patel says Rishabh Pant will be an ex-factor for Delhi Capitals this season as well.
'దిల్లీ క్యాపిటల్స్​కు ఈసారి కూడా అతడే ఎక్స్‌-ఫ్యాక్టర్!'

By

Published : Apr 2, 2021, 7:45 AM IST

దిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్లోనూ రిషభ్‌ పంత్‌ ఎక్స్‌-ఫ్యాక్టర్‌గా మారతాడని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అంటున్నాడు. స్వతహాగా అతడు ప్రతిభావంతుడని ప్రశంసించాడు. ఎంఎస్‌ ధోనీతో పోలికల వల్ల ఇబ్బంది పడ్డాడని చెప్పాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటం వల్ల దిల్లీకి ఈ సారి రిషభ్ సారథ్యం వహిస్తున్నాడు.

'దిల్లీకి రిషభ్‌ పంతే ఎక్స్‌-ఫ్యాక్టర్‌. గత సీజన్‌కు అతడు అత్యుత్తమ ఫామ్‌లో లేడు. ఈ సారి టీమ్‌ఇండియాకు మాత్రం అదరగొట్టాడు. అదే ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడకు తీసుకొస్తున్నాడు. నిజానికి టీ20లకు కావాల్సింది అదే. ఎందుకంటే మనసులో ఎలాంటి సందేహాలూ ఉండకూడదు. ముఖ్యంగా పంత్‌లాంటి ఆటగాడికి అస్సలు ఉండొద్దు' అని పార్థివ్‌ అన్నాడు.

'ఎంఎస్‌ ధోనీతో పోలికల వల్ల పంత్‌పై భారం పెరిగింది. అందుకు తగ్గట్టే అతడూ ప్రయత్నించాడు. వాస్తవంగా పంత్ ‌స్వయంగా ప్రతిభాశాలి. ఎంఎస్‌ ధోనీలా ఆడాలని అతడు ఆందోళన చెందకూడదు. ఎందుకంటే అతడు మహీ కన్నా మెరుగ్గా ఆడొచ్చు లేదా కుదిరిన ప్రతిసారీ మ్యాచులు గెలిపించొచ్చు' అని పార్థివ్‌ తెలిపాడు.

ఇదీ చదవండి:'అంపైర్స్‌ కాల్‌'పై వెనక్కి తగ్గని ఐసీసీ

ABOUT THE AUTHOR

...view details