టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్.. ధోని గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను రాసిన 'ది బేర్ఫుట్ కోచ్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ విషయాల్ని వెల్లడించాడు.
"నేను జట్టుతో ఉన్న సమయంలో టెస్టులకు కుంబ్లే, వన్డేలకు ధోని కెప్టెన్లుగా ఉండేవారు. మ్యాచ్ ప్రాక్టీస్, జట్టు సమావేశాలకు కొన్నిసార్లు ఆటగాళ్లు ఆలస్యంగా వచ్చేవారు. వారికి రూ. 10వేలు జరిమానా విధించాలని టెస్టు జట్టు సారథి కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కానీ అందుకు భిన్నంగా ఆలోచించాడు ధోని. ఏ ఒక్క క్రికెటర్ నిర్ణీత సమయానికి రాకపోయినా.. జట్టు సభ్యులు ఒక్కొక్కరూ రూ. 10వేలు చెల్లించాలని ఆదేశించాడు. ఆ తర్వాత ఏ ఆటగాడూ ఆలస్యంగా రాలేదు’ -ప్యాడీ ఆప్టన్