తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీ జట్టుకు దిగ్గజ కోచ్​.. ఇకనైనా తీరు మారేనా..! - mark boucher news

దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఆ దేశ దిగ్గజ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మార్క్‌ బౌచర్‌ నియమితుడయ్యాడు. ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యం, బోర్డులో అంతర్గత సమస్యల కారణంగా ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టింది సఫారీ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగానే ఇటీవల మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించగా.. తాజాగా బౌచర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది.

former South African cricketer Mark Boucher appointed as  Proteas head coach
దక్షిణాఫ్రికా జట్టుకు దిగ్గజ కోచ్​... ఇకనైనా తీరు మారేనా..?

By

Published : Dec 14, 2019, 9:06 PM IST

ఒకప్పుడు స్టార్​ క్రికెటర్లతో కళకళలాడిన దక్షిణాఫ్రికా జట్టు.. ప్రస్తుతం చిన్నజట్లకు కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​లో ఫేవరెట్లలో ఒక జట్టుగా బరిలోకి దిగి... అసలు నాకౌట్​లో అడుగుపెట్టకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత పలు సిరీస్​లలో ఘోర పరాభవం చెందింది. అందుకే జట్టును ప్రక్షాళన చేసి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు దక్షిణాఫ్రికా బోర్డు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆ దేశానికి చెందిన దిగ్గజ క్రికెటర్​ మార్క్​ బౌచర్​ను కోచ్​గా నియమించింది.ఈ పదవిలో 2023 వరకు నాలుగేళ్లు కొనసాగనున్నాడీ మాజీ క్రికెటర్.

అనూహ్యంగా వీడ్కోలు...

ప్రొటీస్ తరఫున దీర్ఘకాలం క్రికెట్​ ఆడిన బౌచర్.. వికెట్‌కీపర్​, బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్​లో తొలి మ్యాచ్​ పాకిస్థాన్‌పై, చివరి మ్యాచ్​ 2012లో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లాండ్​తో ప్రాక్టీస్​ మ్యాచ్​ సందర్భంగా కంటికి బెయిల్ తగిలి గాయపడ్డాడు. అనంతరం అనూహ్యంగా క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు.

కెరీర్​ రికార్డులు ఇవే..

15 ఏళ్ల తన కెరీర్‌లో 147 టెస్టులాడిన బౌచర్.. 30.30 సగటుతో 5,515 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. 295 వన్డేలాడిన బౌచర్.. 28.57 సగటుతో 4,686 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 26 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. 25 టీ20లు మాత్రమే ఆడిన ఈ మాజీ క్రికెటర్​.. 17.86 సగటుతో 268 రన్స్ చేశాడు.

కీపర్​గా అంతర్జాతీయ కెరీర్‌లో 998 మందిని ఔట్​ చేశాడు. బ్యాట్స్​మన్​గా కెరీర్​లో 10వేల పరుగులు పూర్తి చేశాడు. ఇందులో మొత్తం 6 సెంచరీలు, 61 అర్ధశతకాలు ఉన్నాయి.

గ్రేమ్​ స్మిత్​ పర్యవేక్షణ...

ఇటీవల సఫారీ జట్టు బోర్డుకు డెరెక్టర్​గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్​, అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన గ్రేమ్​ స్మిత్​ ఎంపికయ్యాడు. అతడు పదవీ బాధ్యతలు చేపట్టాక బౌచర్​ నియామకం జరిగింది. వీళ్లిద్దరూ అత్యున్నత పదవుల్లో చేరాక... దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆస్ట్రేలియాతో​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details