జాతీయ రగ్బీ లీగ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్.. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) కొత్త చీఫ్గా నియమితులయ్యారు. సోమవారం జరిగిన ఏసీఏ బోర్డు మీటింగ్లో సభ్యులందరూ కలిసి గ్రీన్బర్గ్ నియమాకాన్ని ఆమోదించారు.
ఆసీస్ క్రికెటర్ల సంఘం చీఫ్గా రగ్బీ లీగ్ మాజీ సీఈఓ - Rugby league boss appointed Australian Cricketers Association chief
ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) కొత్త చీఫ్గా జాతీయ రగ్బీ లీగ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ నియమితులయ్యారు. ఈ అవకాశం తనకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు గ్రీన్బర్గ్.
గ్రీన్బర్గ్
ఈ పదవికి తనను ఎంపిక చేయడం పట్ల ఏసీఏ బోర్డు సభ్యులు, ఆసీస్ ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపారు గ్రీన్బర్గ్. ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు. గతేడాది ఏప్రిల్లో జాతీయ రగ్బీ లీగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి ఆయన రాజీనామా చేశారు గ్రీన్బర్గ్.
ఇదీ చూడండి :రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్గా సంగక్కర