రెండు రోజుల్లోనేమూడో టెస్టు ముగియడం వల్ల మొతేరా పిచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ వికెట్ టెస్టు మ్యాచ్‌లకు సరైంది కాదని దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే అది ముమ్మాటికీ బ్యాట్స్‌మెన్ వైఫల్యమేనని మాజీలు సునీల్ గావస్కర్, కెవిన్ పీటర్సన్ అన్నారు. స్పిన్ బౌలింగ్‌కు విపరీతంగా అనుకూలించిన మొతేరా పిచ్‌పై 10 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది టీమ్ఇండియా.
"టెస్టు మ్యాచ్‌కు ఈ పిచ్ సరైనది కాదు. భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది."
-వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్
"ఇది సరైన పిచ్ కాదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 200 పరుగులు చేసి ఉంటే భారత్ ఇబ్బందుల్లో పడేది. రెండు జట్లకు అదే వర్తిస్తుంది."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా వెటరన్స్పిన్నర్
"రెండు రోజుల్లో మ్యాచ్ అయిపోయింది! టెస్టు క్రికెట్‌కు ఈ పిచ్ సరైనదేనా అనేది నేను చెప్పలేను. అయితే ఇలాంటి పిచ్‌లపై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ బౌలింగ్ చేసి ఉంటే వరుసగా వెయ్యి, 800 వికెట్ల క్లబ్లో చేరేవారేమో! అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్, అశ్విన్, ఇషాంత్ శర్మలకు అభినందనలు."
- యువరాజ్ సింగ్, భారత మాజీ ఆల్‌రౌండర్
"ఈ పిచ్ గురించి చెప్పాలంటే.. ప్రతి జట్టుకు మూడు ఇన్నింగ్స్‌లు ఇవ్వాలి."
-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్