న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ బ్రూస్ టేలర్(77) శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. న్యూజిలాండ్ క్రికెట్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపింది.
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ బ్రూస్ టేలర్ మృతి - న్యూజిలాండ్ క్రికెట్ ట్వీట్
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ బ్రూస్ టేలర్ మృతిచెందాడు. ఆనారోగ్యం కారణంగా శనివారం ఆయన మరణించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
![న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ బ్రూస్ టేలర్ మృతి Former NZ all-rounder Bruce Taylor passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10520020-thumbnail-3x2-bruce.jpg)
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ బ్రూస్ టేలర్ మృతి
ఇప్పటి వరకు టేలర్ న్యూజిలాండ్ తరపున 32 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 30 సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లలో 898 పరుగులు సాధించి 111 వికెట్లు తీశాడు. 1972 వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలు సాధించాడు. టెస్టు అరంగేట్రంలో శతకం చేసి ఐదు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ టేలర్ కావడం విశేషం.