కేరళ మాజీ రంజీ క్రికెటర్ జయమోహన్ తంపి(64) హత్యకు గురయ్యారు. దీనితో సంబంధం ఉందనే అనుమానంతో ఆయన కుమారుడు అశ్విన్‌తో పాటు పక్కింటి అతడ్ని అరెస్టు చేశారు.
మాజీ రంజీ క్రికెటర్ హత్య.. కుమారుడు అరెస్టు - మాజీ క్రికెటర్ హత్య
కేరళ మాజీ రంజీ క్రికెటర్ జయమోహన్‌ను అనుమానస్పద రీతిలో హత్య చేశారు. దీంతో ఆయన కుమారుడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
![మాజీ రంజీ క్రికెటర్ హత్య.. కుమారుడు అరెస్టు Former Kerala cricketer Jayamohan Thampi murdered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7552252-278-7552252-1591762039229.jpg)
మాజీ రంజీ క్రికటర్ జయమోహన్ తంపి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరువనంతపురం మనక్కడ్లోని తన స్వగృహంలో జయమోహన్ శవమై కనిపించారు. ఆయన నుదటిపై తీవ్రగాయాలు ఉన్నాయి. అశ్విన్ ఇంటి నుంచి దుర్గంధం వస్తుందని ఇరుగుపొరుగు వారు సోమవారం ఫిర్యాదు చేయడం వల్ల ఈ విషయం బయటపడింది. అయితే ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: