నాలుగు రోజుల టెస్టు ఆలోచనపై టీమిండియా మాజీ క్రికెటర్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, గౌతమ్ గంభీర్ సహా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు. దేశవాళీల్లోని సుదీర్ఘ ఫార్మట్ మ్యాచ్లు నాలుగు రోజులే ఆడుతున్నారని... అందులో ఫలితాలు వస్తున్నాయి కదా అని అన్నాడు.
" సుదీర్ఘ ఫార్మాట్ భవిష్యత్తు కోసం నాలుగు రోజుల టెస్టుకు మద్దతు పలకాలి. ఈ తరహా మ్యాచ్లు రంజీల్లో ఇప్పటికే ఆడుతున్నారు. ఫలితాలూ వస్తున్నాయి. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి ఈ విధానం తీసుకొస్తే ఫలితాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా రెండేళ్ల తర్వాత అయినా వీటిని రెగ్యులర్గా ప్రవేశపెడితే బాగుంటుంది".
--ఇర్ఫాన్ పఠాన్, భారత మాజీ క్రికెటర్