భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్. ఇటీవల యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అతడు కౌంటర్ ఇచ్చాడు. క్రికెట్‌పై అభిమానుల ఆసక్తి పెంచడానికి.. భారత్ X పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు కృషి చేయాలని ఇటీవల చెప్పాడు యువీ. అందుకు చేతన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
" ఇరు దేశాల మధ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకూడదు. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం మంచిది కాదు. ఉగ్రవాదులు క్రికెట్‌ను కూడా వదిలిపెట్టరు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులున్నంత కాలం ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆడకూడదు"
-- చేతన్ చౌహాన్, టీమిండియా మాజీ క్రికెటర్