తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్ ఫిజియోగా ప్యాట్రిక్ - Former India physio Farhart joins Delhi Capitals

నాలుగేళ్లుగా టీమిండియాకు ఫిజియోగా పనిచేసిన ప్యాట్రిక్ ఫర్హాత్ వచ్చే సీజన్​లో ఐపీఎల్​లో మరోసారి తన సేవల్ని అందించనున్నాడు. దిల్లీ క్యాపిటల్స్​కు ఫిజియోగా పనిచేయబోతున్నాడు.

ఫర్హాత్

By

Published : Aug 2, 2019, 4:50 PM IST

టీమిండియా మాజీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్ మరోసారి ఐపీఎల్​లో తన సేవల్ని అందించనున్నాడు. వచ్చే సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఫిజియోగా బాధ్యతల్ని నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ధృవీకరించింది.

"ఫర్హాత్ మా జట్టుకు సేవల్ని అందించడానికి అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నాం. ప్యాట్రిక్ సారథ్యంలో దిల్లీ జట్టు ఆటగాళ్లు రాటుదేలుతారని భావిస్తున్నాం".
-ధీరజ్ మల్హోత్రా, దిల్లీ క్యాపిటల్స్ సీఈఓ

టీమిండియాకు నాలుగేళ్లు ఫిజియోగా సేవలందించిన ప్యాట్రిక్​కు ప్రపంచకప్​తో గడువు ముగిసింది. మరోసారి ఐపీఎల్​కు తన సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకుముందు ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ఫిజియోగా పనిచేశాడు.

"ఐపీఎల్​లో మరోసారి పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. రెండేళ్లుగా దిల్లీ క్యాపిటల్స్ మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్​లో మూడో స్థానంలో నిలిచింది".
-ప్యాట్రిక్ ఫర్హాత్, టీమిండియా మాజీ ఫిజియో

ఈ సీజన్​లో పేరు మార్చుకుని బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ మంచి ప్రదర్శన చేసింది. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చి మూడో స్థానంలో నిలిచింది.

ప్యాట్రిక్

ఇవీ చూడండి.. యాషెస్​ సిరీస్​: ఆసీస్​ను ఆదుకున్న స్మిత్​

ABOUT THE AUTHOR

...view details