భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీని శుక్రవారం బోర్డు నియమించింది. ఈ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమ్ఇండియా మాజీ పేసర్ చేతన్ శర్మను బోర్డు ఎంపిక చేయగా.. అబ్బే కురువిల్లా, డెబాషిస్ మొహంతిలను ఇందులో సభ్యులుగా చేర్చింది.
ఐపీఎల్లో పది జట్లు
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో బోర్డు సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొత్త జట్లు చేర్చే విషయమై బీసీసీఐ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 2022 నుంచి ఐపీఎల్లో 10 జట్లు పోటీపడనున్నాయి.
ఒలింపిక్స్‌కు క్రికెట్!