బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ సారథి, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ క్రిస్ శ్రీకాంత్. వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ లాంటి గొప్ప ఆటగాడని అభివర్ణించాడు. అతడికి నాయకత్వ లక్షణాలు స్వతహాగా పుట్టుకతోనే ఉన్నాయని కొనియాడాడు. విదేశీ గడ్డపై టీమ్ ఇండియా విజయాలు సాధించడానికి ప్రేరణగా నిలిచాడని అన్నాడు.
"గంగూలీ క్రీయాశీలకంగా వ్యవహరిస్తాడు. బలమైన జట్టును తయారుచేయగల సామర్థ్యం కలవాడు. 1976లో సారథిగా వ్యవహిరించిన వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ బలమైన జట్టును ఎలా తయారుచేశాడో అలానే గంగూలీ కూడా టీమ్ ఇండియా జట్టును రూపొందించి వారిని విజేతలుగా నిలిపాడు. అందుకే గంగూలీ విజయవంతమైన సారథి అయ్యాడు."