భారత మహిళా క్రికెట్‌లో లైంగిక వేధింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆటగాడు, బరోడా మహిళా జట్టు ప్రధాన కోచ్ అతుల్ బెడాడేపై ఈ ఆరోపణలు వచ్చాయి. చాలా మంది మహిళా ప్లేయర్లు ఇతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇతడిని కోచ్గా తక్షణమే తీసేసింది బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ). ఈ విషయంపై ఓ నిజనిర్ధారణ కమిటీని వేసినట్లు బోర్డు తెలిపింది. గత నెల హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఓ వన్డేలో.. మహిళల సీనియర్ జట్టు సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇతడిపై ఆరోపణలు వచ్చాయి.
భారత మాజీ క్రికెటర్పై లైంగిక వేధింపుల కేసు - Atul Bedade sexual harasment
టీమిండియా మాజీ క్రికెటర్, బరోడా మహిళా జట్టు కోచ్ అతుల్ బెడాడేపై వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ).
లైంగిక వేధింపుల వలలో భారత మాజీ క్రికెటర్
1994లో భారత్ తరఫున 13 వన్డేలు ఆడిన అతుల్.. ఆశించిన మేర బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. కెరీర్‌లో 22.57 సగటుతో 158 పరుగులు మాత్రమే చేశాడు. గతంలోనూ ఇతడు బరోడా పురుషుల జట్టుకు కోచ్గా సేవలందించాడు.