ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను ఉదాహరణగా చూపిస్తూ.. విద్యార్థుల్లో ప్రేరణ నింపడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపాడు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కలిసి ప్రధాని ఇటీవల 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే పేరును మోదీ ప్రస్తావించారు. 2002లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే.. గాయాన్ని లెక్కచేయకుండా దేశం కోసం ఆటను కొనసాగించారని గుర్తుచేశారు.
మోదీ తన పేరు ప్రస్తావించడంపై కుంబ్లే ఇవాళ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు ఈ మాజీ లెగ్ స్పిన్నర్.