పాక్ క్రికెట్ జట్టు కోచ్ రేసులో ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుత కోచ్ మిక్కీ ఆర్థర్ పదవీకాలం ముగియడం వల్ల నూతన కోచ్ ఎంపిక చేపట్టింది పీసీబీ.
ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు సభ్యులు... కోచ్ సహా పలు పదవుల్లో కొత్తవారిని నియమించనున్నట్లు ప్రకటించారు. ప్రధాన కోచ్ ఆర్థర్, బౌలింగ్ కోచ్ అజహర్ మొహ్మద్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లావర్ల కాంట్రాక్టులను పునరుద్ధరించట్లేదని బుధవారం ప్రకటన విడుదల చేశారు.