తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనాను జయించిన బంగ్లా మాజీ సారథి మొర్తజా

బంగ్లాదేశ్​ క్రికెట్​ జట్టు మాజీ సారథి మష్రఫె మొర్తజా కరోనా నుంచి కోలుకున్నాడు. జూన్​ 20న మహమ్మారి బారిన పడిన ఈ క్రికెటర్​.. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు.

Mashrafe Mortaza
కరోనాను జయించిన బంగ్లా మాజీ సారథి మొర్తజా

By

Published : Jul 15, 2020, 11:40 AM IST

Updated : Jul 15, 2020, 11:48 AM IST

బంగ్లా సీనియర్​ క్రికెటర్​, మాజీ సారథి మష్రఫె మొర్తజా కరోనాను జయించాడు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేశాడు. ఇంట్లోనే కరోనా చికిత్స​ పూర్తయిందని ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. జూన్​ 20న ఇతడికి కొవిడ్​-19 పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. తాజా టెస్టుల్లో నెగిటివ్​ వచ్చినట్లు మొర్తజా స్పష్టం చేశాడు.

"అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. దేవుడి దయవల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల నేను కరోనా నుంచి కోలుకున్నాను. తాజాగా చేసిన టెస్టులో ఫలితం నెగిటివ్​ వచ్చింది. కష్టసమయంలో నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంట్లోనే కరోనాకు ట్రీట్​మెంట్​ చేయించుకున్నా. బాధితులు పాజిటివ్​గా ఉండండి. దేవుడి కృప మీపై ఉంటుంది. మనందరం కరోనాపై పోరాడుదాం"

-- మష్రఫె మొర్తజా

తన భార్య సుమోనా మాత్రం కోలుకోడానికి కొద్దిగ సమయం పడుతుందని వెల్లడించాడు 36 ఏళ్ల పేసర్​ మొర్తజా. ప్రస్తుతం ఈ స్టార్​ క్రికెటర్​ పార్లమెంట్​ సభ్యుడిగా అవామీ లీగ్​ పార్టీ తరఫున ఉన్నాడు. ఇతడితో పాటు బంగ్లా జట్టు స్పిన్నర్​ నజ్మల్​ ఇస్లామ్, ఆ జట్టు వన్డే కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సోదరుడు, మాజీ క్రికెటర్‌ నఫీజ్‌ ఇక్బాల్‌కు కూడా వైరస్‌ సోకింది. వీరిద్దరూ ప్రస్తుతం కోలుకొని హోమ్​ క్వారంటైన్​లో ఉన్నారు.

Last Updated : Jul 15, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details