బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సోదరుడు, మాజీ క్రికెటర్ నఫీజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఇతడు చిట్టగాంగ్‌లోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాడని ఆ దేశానికి చెందిన ఓ వార్తపత్రిక రాసుకొచ్చింది.
2003లో బంగ్లా తరఫున కెరీర్ ప్రారంభించిన నఫీజ్ ఇక్బాల్.. 2006 నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 34 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్.. 11 టెస్టులు, 16 వన్డేలు ఆడి వరుసగా 518, 309 పరుగులు చేశాడు.