ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ వైట్ తన రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్‌కు తెరదించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు అతను శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్ తరపున నాలుగు టెస్టులు, 91 వన్డేలు, 47 టీ20లు ఆడిన వైట్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏడు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కోచింగ్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికినట్లు తెలిపాడు.
ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ వైట్ వీడ్కోలు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ వైట్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోచింగ్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికినట్లు తెలిపాడు.
"నేను క్రికెట్ ఆడడం కచ్చితంగా ముగించా. దేశవాళీ జట్టు అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున గతేడాది కొన్ని మ్యాచ్‌లే ఆడా. మరొక ఒప్పందం కుదరాలంటే ఆ మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఏర్పడింది. కానీ నిజంగా చెప్పాలంటే ఆటగాడిగా నా కథ ముగిసింది. ఓ క్రికెటర్‌గా చాలా సమయం గడిపా. ఇక పూర్తిస్థాయి కోచ్‌గా మారాలని అనుకుంటున్నా. దానిపైనే దృష్టి పెడతా. కోచ్‌గా రాణిస్తానో లేదో తెలియదు కానీ ప్రయత్నమైతే చేస్తా. నిరుడు స్ట్రైకర్స్ తరపున కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించడాన్ని ఆస్వాదించా" అని 37 ఏళ్ల వైట్ పేర్కొన్నాడు.