ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్(59) గుండెపోటుతో గురువారం మరణించారు. ప్రస్తుత ఐపీఎల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న ఈయన, ముంబయిలోని ఓ హోటల్లో తుదిశ్వాస విడిచారు.
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి - Former Australia batsman Dean Jones
ఆసీస్ మాజీ క్రికెటర్, ఐపీఎల్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. ముంబయిలో గురువారం, గుండెపోటుతో మరణించారు. ఈయన మృతిపై పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
![ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి Former Australia batsman Dean Jones dies of cardiac arrest in Mumbai.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8921176-64-8921176-1600946901463.jpg)
Dean Jones dies
అంతర్జాతీయ కెరీర్లో 1984 నుంచి 1992 మధ్య ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 3631 పరుగులు చేశారు. ఇందులో 11 శతకాలు, 14 అర్థ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో 6068 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Last Updated : Sep 24, 2020, 5:00 PM IST