ఐపీఎల్ ట్రేడింగ్ విండో విధానంలో భాగంగా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు ధవల్ కులకర్ణిని ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ బదిలీలపై గల కారణాలను భారత మాజీ పేసర్, ముంబయి ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్‌ఖాన్ వివరించాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య ఫిట్నెస్ సమస్యల వల్ల బౌలింగ్ విభాగంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు వీరిద్దరిని తీసుకున్నామని అన్నాడు.
"ముంబయి జట్టుకు ఈ సీజన్ కాస్త భిన్నమైనది. ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. హార్దిక్ పాండ్య వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. బుమ్రా వెన్ను గాయంతో బాధపడతున్నాడు. బెహ్రండార్ఫ్నూ వెన్నుగాయం బాధిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకునే ట్రేడింగ్ విండోలో బౌల్ట్, కులకర్ణిలను తీసుకున్నాం. బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా ఉండాలని దిల్లీ, రాజస్థాన్ నుంచి ఆటగాళ్లను బదిలీ చేసుకున్నాం."
-జహీర్ ఖాన్, ముంబయి ఇండియన్స్ డైరెక్టర్