టీమిండియా తరఫున ఈ ఏడాదితో పాటు 2020 దశాబ్దంలో తొలి వికెట్ తీసిన బౌలర్గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు.
టీమిండియా తరఫున 'సుందర్' అరుదైన ఘనత - వాషింగ్టన్ సుందర్
టీమిండియా యువ బౌలర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను ఔట్ చేసి భారత్ తరఫున ఈ ఏడాది తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న బౌలర్గా నిలిచాడు.
![టీమిండియా తరఫున 'సుందర్' అరుదైన ఘనత First Wicket For Indian in This Year and Decade 2020 by Washington Sundar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5629054-1094-5629054-1578407762136.jpg)
ఈ దశాబ్దపు తొలి వికెట్ ఇతడిదే...
1990లో కపిల్ దేవ్, 2000లో శ్రీనాథ్, 2010లో శ్రీశాంత్ దశాబ్దపు తొలి వికెట్ సాధించారు. తాజాగా వాషింగ్టన్ సుందర్ 2020 దశాబ్దపు మొదటి వికెట్ నమోదు చేశాడు.
ఇప్పటివరకు 19 టీ20లు ఆడిన సుందర్.. 16 వికెట్లు తీశాడు. ఇందులో 3/22 అత్యుత్తమం. మొత్తంగా 6.66ఎకానమీతో పరుగులిచ్చాడు.