అప్పట్లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ . దీంతో వారిపై మండిపడ్డారు ఇంగ్లీష్ క్రీడాభిమానులు. ఇంగ్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ వార్నర్, స్మిత్‌లను టార్గెట్ చేసుకుని విమర్శించారు.
అయితే ప్రస్తుతం ఖాళీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ విషయమై స్పందించిన వార్నర్.. ప్రేక్షకులు లేకుండా క్రికెట్ ఆడటం కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు. అయితే ఇలా జరగడం మంచిదేనన్నాడు. దీంతో తొలిసారిగా ఇక్కడి అభిమానుల తిట్ల నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చాడు.