తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీలో ఛైర్మన్​గా కొనసాగలేను బాబోయ్​ - icc latest news 2019

ఐసీసీలో తొలి స్వతంత్ర ఛైర్మన్​గా పేరు తెచ్చుకున్న శశాంక్​ మనోహర్​... వచ్చే ఏడాది మేలో ఆ పదవికి గుడ్​బై చెప్పనున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆ బాధ్యతలు చేపట్టిన శశాంక్... మూడోసారి కొనసాగలేనని అన్నారు. 2016లో ఆయన మొదటిసారి ఐసీసీకి ఛైర్మన్​ అయ్యారు.

first independent chairman of  ICC Shashank Manohar will not be able to run for a third two-year term in May 2020
ఐసీసీలో నేను కొనసాగలేను బాబోయ్​...!

By

Published : Dec 10, 2019, 8:24 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​(ఐసీసీ) స్వతంత్ర ఛైర్మన్​ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం... వచ్చే ఏడాది మే నెలతో పూర్తవుతుంది. ఇప్పటికే రెండుసార్లు ఆ బాధ్యతలు చేపట్టిన శశాంక్... మూడోసారి ఈ పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు.

" ఇంకో రెండేళ్లు ఐసీసీ ఛైర్మన్​గా కొనసాగడానికి సిద్ధంగా లేను. మెజారిటీ డైరెక్టర్లు నన్నే పదవిలో కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఈ బాధ్యతల్లో ఉన్నాను. ఐసీసీ ఛైర్మన్‌గా నా ప్రయాణం వచ్చే ఏడాది మే నెలతో ముగుస్తుంది. జూన్‌లో కొత్త వ్యక్తి ఛైర్మన్​గా వస్తారు"
-- శశాంక్​ మనోహర్​, ఐసీసీ ఛైర్మన్​

2016 మేలో తొలిసారి ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌ పదవిని ఏర్పాటు చేయగా.. శశాంక్​ మనోహర్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దుబాయ్​లోని ఐసీసీ ప్రధానకార్యాలయం

బీసీసీఐపై ప్రభావం...

ఐసీసీలో ఉండి శశాంక్​ తీసుకున్న పలు నిర్ణయాలు బీసీసీఐ మీద ప్రభావం చూపాయి. భారత్​, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల అపరిమిత అధికారాలను రద్దుచేశారు. ఐసీసీ ఇవ్వాల్సిన ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను భారీగా తగ్గించారు. ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో పెద్దన్నగా ఉండే భారత్​ ప్రాతినిధ్యం లేకపోయినా కార్యక్రమం నిర్వహించారు. ఇతడి రాజీనామాతో భారత్​కు లాభమా, నష్టమా అనేది కొత్త అధ్యక్షుడి నియామకం మీద ఆధారపడి ఉంటుంది.

ఇదీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details