తెలంగాణ

telangana

ETV Bharat / sports

సుందర్​కు మరో అవకాశం.. 'కుల్దీప్'​కు ఇప్పటికైనా?

తొలి టెస్టులో బౌలింగ్​లో పెద్దగా రాణించనప్పటికీ రెండో టెస్టులోనూ యువ ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ ఆడే అవకాశం ఉంది. అతడికి మరో అవకాశం ఇవ్వాలని మాజీలు భావిస్తున్నారు. అయితే పిచ్​ స్పిన్​కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో.. సీనియర్ స్పిన్నర్​ కుల్దీప్, యువ బౌలర్ రాహుల్​ చాహర్​లకు అవకాశం దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Finger vs Wrist: Washington up against Kuldeep, Rahul in three-way battle for final spinner's slot
సుందర్​కు మరో అవకాశం.. కుల్దీప్​కు ఇప్పటికైనా?

By

Published : Feb 12, 2021, 7:42 PM IST

తొలి టెస్టులో ఇంగ్లాండ్​తో ఘోర పరాభవంతర్వాత బౌలింగ్​లో పలు మార్పులకు యత్నిస్తోంది టీమ్​ఇండియా. నలుగురు స్పిన్నర్లను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​ ప్రాక్టీస్ చేస్తున్న చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. తుది జట్టులో అతడి ఎంపికను నిర్ధరించనప్పటికీ తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన షాబాజ్ నదీమ్​ స్థానంలో అక్షర్​ను తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సుందర్​, కుల్దీప్​లపైనే మాజీల మొగ్గు..

బౌలింగ్​లో విఫలమైనా.. బ్యాటింగ్​లో విశేషంగా రాణిస్తున్న యువ ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ జట్టులో చోటు నిలుపుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మాజీ సెలక్టర్లు ఇదే చెబుతున్నారు. అయితే మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్​ల నుంచి సుందర్​కు గట్టి పోటీ ఎదురు కానుంది.

బౌలింగ్​లో అటాక్​ కోసం నదీమ్​ స్థానంలో సీనియర్​ స్పిన్నర్​ కుల్దీప్​ను తీసుకోవాలని మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే సూచించారు. రాహుల్​ నైపుణ్యవంతుడని అయితే ఒత్తిడిలో కుల్దీప్​ బాగా రాణిస్తాడని చెప్పారు మరో మాజీ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్​.

ఇదీ చూడండి:తొలిటెస్టులో భారత్ ఓటమి..​ క్యూరేటర్ తొలగింపు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details