తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 8:46 PM IST

ETV Bharat / sports

'కోహ్లీని స్లెడ్జింగ్​ చేస్తే మీకు ప్రమాదం'

టెస్టు సిరీస్​ కోహ్లీని అస్సలు స్లెడ్జింగ్​ చేయకూడదని ఫించ్ తమ దేశ ఆటగాళ్లకు చెప్పాడు. అలా చేయడం చాలా ప్రమాదకరమని పేర్కొన్నాడు.

Finch warns his Aussie Test teammates as Do not confront Kohli
'విరాట్​ కోహ్లీని స్లెడ్జింగ్​ చేస్తే ప్రమాదమే'

భారత జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీని స్లెడ్జింగ్​ చేయొద్దని ఆసీస్​ ఆటగాళ్లను హెచ్చరించాడు ఆ దేశ ఆటగాడు ఆరోన్ ఫించ్. అది చాలా ప్రమాదమని అన్నాడు. అడిలైడ్ వేదికగా ఈనెల 17న తొలి​ టెస్టు జరగనున్న నేపథ్యంలో ఫించ్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"కోహ్లీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆటలో మెలకువలను త్వరగా అర్థం చేసుకుంటాడు. సెడ్జింగ్​ లాంటి కొన్ని సందర్భాలు విరాట్​కు విసుగు పుట్టిస్తాయి. అప్పుడు ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడతాడు. దీనితో పాటే మరింత నిలకడగా బ్యాటింగ్ చేస్తాడు"

-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా జట్టు టీ20 కెప్టెన్

కోహ్లీని స్లెడ్జింగ్​ చేయడం ఆసీస్ ఆటగాళ్లకు ప్రమాదమని గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా చెప్పాడు. అలా చేస్తే మరింత చెలరేగి ఆడతాడని తెలిపాడు.

తొలి టెస్టు తర్వాత పితృత్వ సెలవులపై స్వదేశానికి రానున్నాడు కోహ్లీ. పర్యటనలో భాగంగా టెస్టులు ఆడనున్న భారత జట్టు.. అంతకు ముందు వన్డే సిరీస్​ను 1-2 తో కోల్పోయింది. టీ20 సిరీస్​ను మాత్రం 2-1 తేడాతో గెల్చుకుంది.

ఇదీ చదవండి:రహానేకు కెప్టెన్సీ భారం కాదు: గావస్కర్

ABOUT THE AUTHOR

...view details