వర్షం కారణంగా న్యూజిలాండ్-వెస్టిండీస్ మూడో టీ20 రద్దయింది. దీంతో 2-0 తేడాతో సిరీస్ కివీస్ సొంతమైంది.
వర్షం వల్ల మూడో టీ20 రద్దు.. సిరీస్ కివీస్‌దే - న్యూజిలాండ్ vs వెస్టిండీస్
బే ఓవల్‌లోని మూడో టీ20 వర్షం వల్ల రద్దయింది. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కివీస్ విజేతగా నిలిచింది. గురువారం ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన విండీస్.. 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడి, ఎంతకీ తగ్గకపోవడం వల్ల రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ముందు జరిగిన టీ20ల్లో ఆకట్టుకున్న ల్యూకీ ఫెర్గుసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
హామిల్టన్ వేదికగా గురువారం(డిసెంబరు 3), ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మరి అది జరుగుతుందో, వర్షార్పణం అయిపోతుందో చూడాలి.