కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కోచ్ రవిశాస్త్రి, సందేశాత్మక వీడియోను ట్వీట్ చేశాడు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశాడు.
"కరోనా మనల్ని విపత్కర పరిస్థితిలోకి తోసేసింది. ఈ వైరస్ను ఎదుర్కొవడం, ప్రపంచకప్ గెలిచేందుకు చేసే పోరాటం లాంటిది. దీని కోసం మనం సర్వశక్తుల కృషి చేయాలి. ఇది మామూలు ప్రపంచకప్(కరోనా) కాదు. ఇప్పటివరకు చూసిన వాటికి అమ్మ లాంటిది(మదర్ ఆఫ్ ఆల్ ప్రపంచకప్స్). ఇక్కడ కేవలం 11 మంది మాత్రమే పోరాటం చేయరు. 130 కోట్ల మంది భారతీయులు తమ వంతు పాత్ర పోషించాలి. అయితే గెలవడం అంత సులభం కాదు. మనందరం ఏకతాటిపైకి వచ్చి కరోనాపై విజయం సాధించాలి. ప్రధాన మోదీ మార్గనిర్దేశకంలో నడిచి, మనల్ని మనదేశాన్ని కాపాడుకుందాం"