తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫీల్డింగ్ తప్పిదాలు కొంపముంచాయి'

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్ తప్పిదాలు, యువ ఆటగాళ్ల అనుభవ లేమి జట్టు ఓటమికి కారణమని తెలిపాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. దీని నుంచి వారు చాలా నేర్చుకుంటారని అన్నాడు.

రోహిత్

By

Published : Nov 4, 2019, 9:56 AM IST

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది టీమిండియా. ఈ ఓటమిపై సారథి రోహిత్ శర్మ స్పందించాడు. తాము చేసిన కొన్ని తప్పిదాలు ప్రత్యర్థి జట్టుకు కలిసొచ్చాయని అన్నాడు.

"బంగ్లాదేశ్​ బాగా ఆడింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి మా మీద ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. స్కోర్​ కట్టడి చేయగలిగిందే. కానీ కొన్ని ఫీల్డింగ్ పొరపాట్లు ప్రత్యర్థి జట్టుకు కలిసొచ్చాయి. యువ ఆటగాళ్లలో అనుభవం లోపించింది. సమీక్షలు కూడా కలిసిరాలేదు. దీని నుంచి వారు చాలా నేర్చుకుంటారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా చూస్తాం."
-రోహిత్ శర్మ, టీమిండియా సారథి

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 148 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60) ఆకట్టుకోవడం వల్ల మూడు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది ప్రత్యర్థి జట్టు. అయితే 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహీమ్ ఇచ్చిన క్యాచ్​ను వదిలేశాడు కృనాల్ పాండ్య.

ఇవీ చూడండి.. పాండ్య పోస్ట్​కు ధోనీ భార్య సాక్షి కామెంట్

ABOUT THE AUTHOR

...view details