తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పాక్ జట్టు ఫీల్డింగ్​ కలవరపెడుతోంది' - pakistan

పాక్ జట్టు ఫీల్డింగ్​ పట్ల ఆందోళనగా ఉందని ఆ 'టీమ్ కోచ్ మికీ ఆర్థర్ తెలిపాడు. మెగాటోర్నీకి ముందు ఈ అంశంపై దృష్టిసారిస్తామని అన్నాడు.

ఆర్థర్

By

Published : May 21, 2019, 10:50 AM IST

ప్రపంచకప్​ ముందు పాకిస్థాన్ జట్టులో ఫీల్డింగ్ లోపాలు కలవరపెడుతున్నాయని ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ చెప్పాడు. ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు.

తాజాగా ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది పాక్ జట్టు. ఈ మ్యాచ్​ల్లో ఇరుజట్లు 300కు పైగా స్కోర్లు సాధించినా అనవసర ఫీల్డింగ్ తప్పిదాల వల్ల పాకిస్థాన్ జట్టు మ్యాచ్​లను కోల్పోయింది. అదే ఫీల్డింగ్​లో రాణించిన ఇంగ్లాండ్​ సిరీస్​ను 4-0 తేడాతో కైవసం చేసుకుంది.

"మా జట్టు ఫీల్డింగ్ పట్ల అసంతృప్తిగా ఉన్నాం. ఇంగ్లాండ్​కు, పాక్​కు మధ్య స్పష్టమైన తేడా అదే. అన్ని మ్యాచ్​ల్లో చాలా బాగా పోరాడాం. ప్రపంచకప్​ జట్టు పట్ల సంతృప్తిగా ఉన్నాం. ముందు రెండు వార్మప్ మ్యాచ్​ల్లో ఫీల్డింగ్​పై దృష్టిపెడతాం. మెగాటోర్నీలో మా వాళ్లు సత్తాచాటుతారని ఆశిస్తున్నా".
-మికీ ఆర్థర్, పాకిస్థాన్ జట్టు కోచ్

ప్రపంచకప్​ మ్యాచ్​లకు ముందు పాక్ జట్టు మే 24న అప్గానిస్థాన్​తో, 26న బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్​లు ఆడుతుంది. మెగాటోర్నీ తొలిపోరులో మే 31న వెస్టిండీస్​తో తలపడనుంది.

ఇవీ చూడండి.. గెలిస్తేనే దక్కుతుంది పరువు: వెసెల్స్

ABOUT THE AUTHOR

...view details