తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2020, 4:04 PM IST

ETV Bharat / sports

ఆ నిర్ణయం విషయంలో సచిన్​కు భజ్జీ మద్దతు​

లెగ్ బిఫోర్​ వికెట్​(ఎల్​బీడబ్ల్యూ) సమీక్షలో 'అంపైర్​ కాల్​'ను తొలగించాలని అభిప్రాయపడ్డారు టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్​, హర్భజన్​. బంతి స్టంప్స్​ను కొద్దిగా తాకినా.. దాన్ని ఔట్​ కింద పరిగణించాలని సచిన్​ ఐసీసీకి సూచించగా.. మాస్టర్​ వ్యాఖ్యలకు మద్దతిస్తూ భజ్జీ ట్వీట్​ చేశాడు.

'Few rules should be changed': Harbhajan wants umpire's call done away with
స్టంప్స్​ను తాకినా ఔట్​గా పరిగణించాలి: హర్భజన్​

క్రికెట్​లో లెగ్​ బిఫోర్​ వికెట్​ (ఎల్​బీడబ్ల్యూ) నిర్ణయానికి సంబంధించి సమీక్ష కోసం 'అంపైర్​ కాల్​'ను తొలగించాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​సింగ్​. ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్​ సచిన్​ అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేయగా.. మాస్టర్​కు మద్దతిస్తూ ట్వీట్​ చేశాడు భజ్జీ. క్రికెట్​ మరింత సులభతరం కావడానికి దీనితో పాటు మరికొన్ని నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు​.

"సచిన్​ చెప్పినదానిని నేను వేయి శాతం అంగీకరిస్తున్నా. బంతి స్టంప్స్​ను తాకి వెళ్లినా.. దాన్ని ఔట్​గా పరిగణించాలి. స్టంప్స్​ను 50 శాతానికి పైగా టచ్​ అవ్వకపోయినా.. తాకుతూ వెళ్లినా ఔట్​గా ప్రకటించాలి. క్రికెట్​ నియమాలలో మార్చాల్సిన రూల్స్​లో ఇదే మొదటిది".

- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

బంతి వికెట్​కు​ తాకడంపై నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని సచిన్​ ఇటీవలే తన ట్విట్టర్​లో అభిప్రాయాన్ని తెలియజేశాడు. "బంతి ఎంత శాతం స్టంప్స్​ను తాకుతుందన్నది అనవసరం. డీఆర్​ఎస్​లో బంతి స్టంప్స్​ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్​మన్​ను ఔట్​గా ప్రకటించాల్సిందే. ఆన్​ఫీల్డ్ అంపైర్ బ్యాట్స్​మన్​ను నాటౌట్​గా ప్రకటించినా అతడి నిర్ణయాన్ని సవరించి ఔటివ్వాలి. ప్రస్తుతం డీఆర్​ఎస్​లో భాగంగా బంతి 50 శాతానికి పైగా స్టంప్స్​ను తాకినప్పుడే ఆన్​ఫీల్డ్​ అంపైర్ నిర్ణయాన్ని సవరిస్తున్నారు. అది సరికాదు". అని సచిన్​ వెల్లడించాడు.

ఎల్​బీడబ్ల్యూ డీఆర్​ఎస్​ సిస్టమ్​

ఎల్​బీడబ్ల్యూకు అంపైర్​ కాల్​ను తొలగించాలని చాలా మంది మాజీ ఆటగాళ్లు సిఫార్సు చేశారు. క్రికెట్​లో కొన్ని నిబంధనలను మార్చాలని అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) నిశ్చయించింది. కరోనా వైరస్​ కారణంగా టెస్టు మ్యాచ్​ల్లో న్యూట్రల్​ అంపైర్లు నియమించడం వల్ల జట్లకు అదనపు సమీక్ష తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధన వల్ల ప్రతి ఇన్నింగ్స్​లో జట్లు గరిష్ఠంగా మూడుసార్లు సమీక్షకు వెళ్లొచ్చు.

ABOUT THE AUTHOR

...view details