తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరోసారి సూర్యకుమార్, అక్షర్​కు మొండిచేయి! - సూర్యకుమార్ యాదవ్ తాజా వార్తలు

ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో మరోసారి సెలక్షన్ కమిటీ వివక్ష చూపించిందని పలువురు మండిపడుతున్నారు. ఐపీఎల్​లో మెరుగ్గా రాణిస్తోన్న సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్​కు అవకాశం కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఆటగాడు మనోజ్ తివారి కూడా సూర్యకుమార్, అక్షర్​కు మద్దతుగా నిలిచాడు.

Few cosy group of people will say that you both were born in the wrong era says Manoj Tiwary
మరోసారి సూర్యకుమార్, అక్షర్ పటేల్​కు మొండిచేయి!

By

Published : Oct 27, 2020, 11:09 AM IST

ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ప్రకటించింది టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీ. అయితే జట్టును ప్రకటించగానే సెలక్షన్ కమిటీ తీరుపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. అనూహ్యంగా సీనియర్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్​ రోహిత్​ శర్మను తప్పించిన బీసీసీఐ.. యువ ఆటగాళ్ల విషయంలోనూ మరోసారి వివక్ష చూపింది.

ఈ ఏడాది ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మన్ సూర్య కుమార్ యాదవ్, దిల్లీ క్యాపిటల్స్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​కు చోటు కల్పించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరో ఆటగాడు మనోజ్ తివారి స్పందించాడు.

"అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్​ కష్టపడినా ఫలితం దక్కలేదు. మీరు ఇలాంటి శకంలో పుట్టి ఆడటం వల్లనే చోటు దక్కట్లేదని కొందరు అంటున్నారు. కానీ మీరు మిగతా వారికంటే మెరుగైన ప్రదర్శన చేయగలరు."

-మనోజ్ తివారి, టీమ్ఇండియా క్రికెటర్

ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన టీ20 జట్టులో కోల్​కతా నైట్​రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు లభించింది.

టీ20 జట్టు: కోహ్లీ(కెప్టెన్), ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, జడేజా, వాషింగ్టన్ సుందర్, చాహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి

వన్డే జట్టు: కోహ్లీ(కెప్టెన్), ధావన్, శుభ్​మన్ గిల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకుర్

టెస్టు జట్టు: కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభ్​మన్ గిల్, వృద్ధిమన్ సాహా, పంత్, బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్, సైనీ, కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్, సిరాజ్

ABOUT THE AUTHOR

...view details