తన కెరీర్ చివరి సమయాల్లో బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆరోపించాడు. తానెప్పుడూ ఫేర్వెల్ మ్యాచ్ కోరుకోలేదని.. కానీ కనీస గౌరవం పొందే అర్హత తనకుందని పేర్కొన్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది జూన్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు యువీ.
"మొదట అందరూ తెలుసుకోవాల్సింది.. నేను లెజండ్ అని ఎప్పుడ అనుకోలేదు. చిత్తశుద్ధితో ఆట ఆడాను. కానీ, ఎక్కువగా టెస్టు క్రికెట్లో పాల్గొనలేదు. లెజండరీ ఆటగాళ్లుకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంటుంది. ఎవరికి ఫేర్వెల్ ఇవ్వాలనే విషయం నేను నిర్ణయించేది కాదు. అది బీసీసీఐకి సంబంధంచింది."