తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ కప్పుల' వ్యాఖ్యలపై ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌ - Anushka sharma, farokh engineer, comment, apologise, kohli

బాలీవుడ్​ నటి అనుష్కశర్మపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కితగ్గాడు టీమిండియా మాజీ క్రికెటర ఫరూక్​ ఇంజినీర్​. ఆమె మంచి అమ్మాయని కితాబిస్తూనే... తాను జోక్​ చేసినట్లు చెప్పాడు. అనుష్కశర్మకు సెలక్టర్లు టీకప్పులు అందించారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు ఫరూక్​.

'టీ కప్పుల' వ్యాఖ్యలపై ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌

By

Published : Nov 1, 2019, 8:05 PM IST

టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ సతీమణి అనుష్కశర్మ, బీసీసీఐ సెలెక్టర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫరూక్‌... బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ, సెలక్షన్‌ కమిటీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్​లో ప్రపంచకప్​ వీక్షణకు వచ్చిన ఈ భామకు.. సెలక్టర్లు టీకప్పులు అందించారని అన్నాడు.

ఈ విషయంపై తీవ్ర దుమారం రేగడం వల్ల అనుష్క, ఎమ్మెస్కే ప్రసాద్‌ వాటిని ఖండించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఫరూక్‌... తాను జోక్‌ చేశానని అన్నాడు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతున్నారని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ వివాదంలోకి అనుష్కశర్మను అనవసరంగా తీసుకొచ్చారని, ఆమె చాలా మంచి అమ్మయని ఫరూక్‌ కొనియాడాడు.

విరాట్​, అనుష్క జోడీ

" అనుష్కకు టీ అందించిన ఘటన నిజంగా జరిగింది. అయితే నేను ఆమెను నిందించడం లేదు. తను చాలా మంచి అమ్మాయి. విరుష్క జోడీ అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఈ విషయంలో ఆమె ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నా. తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని సెలక్టర్లపైనే నా కోపమంతా. విరాట్‌, అనుష్కల మీద కాదు"
--ఫరూక్​ ఇంజినీర్, మాజీ క్రికెటర్​

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని అని, కోచ్‌ రవిశాస్త్రి కూడా బాగా పనిచేస్తున్నాడని మెచ్చుకున్నాడు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని మాజీ క్రికెటర్‌ వ్యాఖ్యానించాడు. ఓ వ్యక్తి టీమిండియా బ్లేజర్‌ వేసుకోవడమే తన వ్యాఖ్యలకు కారణమని సమర్థించుకున్నాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details