టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి మరోసారి అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఆరుగురిని ఇంటర్వ్యూ చేసిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ శాస్త్రికే పట్టం కట్టింది. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.
కోచ్గా రవిశాస్త్రి పేరు ప్రకటించగానే అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు. ఇప్పడు కోహ్లీ, శాస్త్రి ఏది చెబితే అది చెల్లుబాటవుతుందని మండిపడుతున్నారు.