తెలంగాణ

telangana

ETV Bharat / sports

కుల్దీప్​కు మరోసారి అన్యాయం.. అభిమానుల ఆగ్రహం! - ఇండియా vs ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​

టీమ్ఇండియా యువ స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​ అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో ఆస్ట్రేలియాతో ఆడిన చివరి టెస్టులోనూ రాణించాడు. అయినా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలిటెస్టులో అతడికి అవకాశం రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కుల్దీప్​ను ఎంపిక చేయకపోవడం వెనక ఏమైనా దురుద్దేశం ఉందా? సెలెక్టర్లు అతడి ప్రదర్శనను గుర్తించకపోవడమే అందుకు కారణమా?

Fans React As Kuldeep Yadav Fails To Find Place In India Playing XI Again
కుల్దీప్​కు మరోసారి అన్యాయం.. అభిమానుల ఆగ్రహం!

By

Published : Feb 5, 2021, 5:25 PM IST

కుల్దీప్​ యాదవ్​.. అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017 మార్చిలో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే జట్టులో చేరి అతడు నాలుగేళ్లుగా రాణిస్తున్నా.. కుల్దీప్​కు మాత్రం సరైన గుర్తింపు రావడం లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణం రెండేళ్లుగా కుల్దీప్​ జాతీయ జట్టులో ఆడకపోవడమే.

సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే.. 2019 జనవరి 3న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కుల్దీప్​ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. మొత్తంగా ఆ సిరీస్​లో ఆడిన ఆరు టెస్టుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ సిరీస్​ తర్వాత రెండేళ్లపాటు కుల్దీప్​కు టెస్టులతో సహా వన్డే, టీ20ల్లోనూ ఆడే అవకాశం రాలేదు. దీంతో దాదాపుగా 764 రోజుల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కుల్దీప్​ ఉత్తమ ప్రదర్శన చేస్తున్నా.. తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం వెనుకు ఏమైనా దురుద్దేశం ఉందా?

కుల్దీప్​ యాదవ్​

మరోసారి మొండిచేయి

చెన్నైలోని చెపాక్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలిటెస్టులో మోకాలు గాయం కారణంగా అక్షర్​ పటేల్​ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ లెఫ్ట్​-ఆర్మ్​ స్పిన్నర్​ షాబాజ్​ నదీమ్​ను జట్టులోకి తీసుకున్నారు. మరో స్పిన్నర్​ రాహుల్​ చాహర్​ను స్క్వాడ్​లో చేర్చారు.

అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల స్క్వాడ్​లో కుల్దీప్​ను ఎంపికచేశారు. అక్షర్​ పటేల్​ జట్టుకు దూరమైనా.. అతడి స్థానంలో టెస్టుల్లో మిగిలిన వారికంటే అనుభవజ్ఞుడైన కుల్దీప్​కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. ప్రాక్టీసు మ్యాచ్​లో కుల్దీప్​ ఆడినా.. తొలి టెస్టులో మాత్రం అతడ్ని పక్కనపెట్టి షాబాజ్​ నదీమ్​ వంటి యువ స్పిన్నర్​కు అవకాశం ఇవ్వడం పట్ల టీమ్ఇండియా సెలెక్టర్లపై పలు రకాల సందేహాలకు తావిస్తోంది.

నెట్టింట విమర్శలు

కుల్దీప్​ చివరిసారిగా ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టులో ఉత్తమంగా రాణించినా.. ఇప్పుడు తుదిజట్టులో అతడికి అవకాశం లభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నెటిజన్లు కూడా కుల్దీప్​ను ఎంపిక చేయకపోవడంపై మీమ్స్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:భారత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ - ఏడాది తర్వాత తొలిసారి

ABOUT THE AUTHOR

...view details