తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిప్పు.. నీరు కలిస్తే ఓ ట్రెండ్ - good man kane williamson

న్యూజిలాండ్ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​తో కోహ్లీకి మంచి అనుబంధం ఉంది. మైదానంలోనే కాకుండా బయట వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. ఇరువురు కలిసున్న ఫొటోను తాజాగా ఇన్​స్టాలో పంచుకున్నాడు విరాట్​. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్​ చేశారు.

Fan's Fitting Caption For Virat Kohli's Picture With Kane Williamson
నిప్పు.. నీరు కలిస్తే ఓ ట్రెండ్

By

Published : May 22, 2020, 4:06 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​.. మైదానంలోనే కాకుండా బయట గొప్ప స్నేహితులుగా ఉన్నారు. కోహ్లీ.. విలియమ్సన్​కు ఎంత గౌరవం ఇస్తాడో.. తను తాజాగా షేర్​ చేసిన ఇన్​స్టా పోస్ట్​ అందుకు నిదర్శనం. భారత జట్టు చివరి న్యూజిలాండ్​ పర్యటనలో విలియమ్సన్​తో కలిసున్న చిత్రాన్ని పోస్ట్​ చేస్తూ.. "మన సంభాషణలను ఇష్టపడతా. మంచి మనిషి" అని కేన్​ను ట్యాగ్​ చేశాడు కోహ్లీ.

మైదానంలో కోహ్లీ దూకుడున్న ఆటగాడిగా ప్రసిద్ధి చెందగా.. విలియమ్సన్​ ప్రశాంతమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. దీన్ని పోలుస్తూ పలువురు నెటిజన్లు స్పందించారు. కోహ్లీని ఫైర్​తో, విలియమ్సన్​ను మంచుతో పోల్చే కామెంట్లు పెట్టారు.

ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా ఇంటివద్దే ఫిట్​నెస్​ కోసం జిమ్​లో కసరత్తులు చేస్తున్నాడు కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ సహచరుడైన ఏబీ డివిలియర్స్​తో ఆకట్టుకునే వర్కౌట్​ వీడియోను ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు.

ఇదీ చూడండి..'నా తల పోయింది.. ఎవరికైనా దొరికిందా?'

ABOUT THE AUTHOR

...view details