పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి భద్రతా వలయాన్ని దాటేశాడు ఓ యువకుడు. నేరుగా మైదానంలోకి వెళ్లి రోహిత్ కాళ్లపై పడ్డాడు. రోహిత్ అతడిని వారిస్తూ కిందపడిపోయాడు. ఇలాంటి ఘటనలతో టీమిండియా భద్రతపై నెట్టింట చర్చ జరుగుతోంది.
వైరల్: రోహిత్‌ను కిందపడేసిన అభిమాని - pune test rohit felt down by fan
పుణె వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రక్షణ వలయం ఛేదించుకొని ఓ యువకుడు మైదానంలోకి ప్రవేశించాడు. విశాఖ టెస్టులోనూ ఇదే విధంగా జరగడంపై టీమిండియా భద్రత అంశం చర్చనీయాంశమైంది.
![వైరల్: రోహిత్‌ను కిందపడేసిన అభిమాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4729639-273-4729639-1570874157286.jpg)
వైరల్: రోహిత్‌ను కిందపడేసిన అభిమాని
సిరీస్‌లో మూడోసారి...
సఫారీల పర్యటనలో మూడోసారి ఇలాంటి ఘటన జరిగింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ ఓ అభిమాని ఇలానే విరాట్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఓ అభిమాని మైదానంలోకి రావడం వల్ల మ్యాచ్‌కు రెండుసార్లు అంతరాయం కలిగింది.