తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్పోర్ట్స్​ ప్రెజెంటర్లను మనువాడిన స్టార్​ క్రికెటర్లు! - మార్టిన్​ గప్తిల్​ లారా మెక్ గోల్డ్ రిక్

టీమ్‌ఇండియా పేసర్‌ జస్​ప్రీత్​ బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్‌ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. వివాహబంధంతో తామిద్దరం ఒక్కటైనట్లు ఇరువురు సోమవారం ప్రకటించారు. ఐతే గతంలోనూ స్పోర్ట్స్ ప్రెజెంటర్‌లను పెళ్లాడిన క్రికెటర్లు ఉన్నారు. ఆ జంటలెవరో ఈ సందర్భంగా తెలుసుకుందాం.

Famous cricketers who married sports anchors
స్పోర్ట్స్​ ప్రెజెంటర్లను మనువాడిన స్టార్​ క్రికెటర్లు!

By

Published : Mar 16, 2021, 9:54 AM IST

Updated : Mar 16, 2021, 10:05 AM IST

టీమ్‌ఇండియా అగ్రశ్రేణి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పెళ్లిపై వస్తున్న ఉహాగానాలకు తెరపడింది. తనో ఇంటివాడినయ్యానని సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం అతనే స్వయంగా ప్రకటించాడు. కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్లే ఓ క్రీడా ఛానెల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజనా గణేశన్‌ను అతను వివాహమాడాడు. గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహా వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్ కారణంగా బయోబబుల్​లో ఉన్న భారత క్రికెటర్లు బుమ్రా పెళ్లికి హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. పెళ్లి కారణంగా టీ20 సిరీస్​కు దూరమైన బుమ్రా.. ఇక సరాసరి ఐపీఎల్​లో ఆడతాడేమో తెలియాల్సిఉంది.

బుమ్రా, సంజనా గణేశన్​

అయితే క్రికెటర్లు, స్పోర్ట్స్ ప్రెజెంటర్‌లు.. వివాహ బంధంతో ఒక్కటవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే పలువురు క్రికెటర్‌లు.. వ్యాఖ్యాతలను తమ జీవితభాగస్వామిగా చేసుకున్నారు. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ.. స్పోర్ట్స్ ప్రెజెంటర్ మయంతి లాంగర్‌ను 2012లో పెళ్లి చేసుకున్నాడు.

స్టువర్ట్ బిన్నీ, మయంతి లాంగర్

అదే విధంగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియాకు చెందిన టీవీ ప్రెజెంటర్ లీ పుర్లాంగ్‌ను 2010లో వివాహం చేసుకున్నాడు.

షేన్ వాట్సన్, లీ పుర్లాంగ్

దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్​ ప్రజెంటర్ రోజ్ కెల్లీని మనువాడాడు.

మోర్నీ మోర్కెల్, రోజ్ కెల్లీ

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్.. లారా మెక్ గోల్డ్ రిక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మార్టిన్ గప్తిల్, లారా మెక్ గోల్డ్ రిక్

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ బెన్ కటింగ్​.. ఎరిన్ హోలాండ్ ఈ ఏడాది ప్రారంభంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతేడాదే వీరి వివాహం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

బెన్ కటింగ్​, ఎరిన్ హోలాండ్

ఇదీ చూడండి:రూమర్లకు చెక్​.. సంజనా గణేశన్​తో బుమ్రా పెళ్లి

బుమ్రా మెచ్చిన సంజనా గణేశన్

Last Updated : Mar 16, 2021, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details