టీమిండియా పేసర్ బుమ్రా చేసిన తప్పిదం తన క్రికెట్ కెరీర్‌కు కొత్త మలుపునిచ్చిందని తెలిపాడు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అది కాస్త నోబాల్‌గా తేలింది. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొనిఫకర్చెలరేగి ఆడాడు. కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఫకర్ జమాన్ 114 పరుగులు చేసి పాక్ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ విషయంపై తాజాగా ఫకర్ జమాన్ మాట్లాడాడు.
"బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఫైనల్‌కి ముందు నోబాల్‌కు ఔటవ్వాలనే కల ఉండేది. అనుకోకుండా అది నిజమైంది. భారత్‌పై మ్యాచ్‌లో బాగా ఆడతానని నా తల్లిదండ్రులకు మాటిచ్చాను. ఫైనల్లో మొదట ఔట్ కాగానే చాలా బాధనిపించింది. అయితే అది నో బాల్ అయినందున శతకం చేశాను. ఆ మ్యాచ్ తర్వాత నేను బాగా ఫేమస్ అయిపోయాను. ఫేమ్‌తో పాటు బాధ్యత కూడా పెరిగింది. గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిణతితో ఆడుతున్నా. ప్రపంచకప్‌లో రాణించడమే తక్షణ కర్తవ్యం.
- ఫకర్ జమాన్, పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్