క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తికి ఎంతో విలువుంటుంది. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ ఆటగాళ్లు ఎలా ఆడారనేదే చాలా ముఖ్యం. అందుకు సంబంధించి 'ఫెయిర్ ప్లే' నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6)ను రనౌట్ చేసిన విధానం క్వింటన్ డికాక్‌కు చెడ్డపేరు తెచ్చేలా ఉంది. అది నిజంగానే క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది.
తొలుత ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ సాధించింది. డికాక్(80), కెప్టెన్ బవుమా(92), వాండర్ డసెన్(60), మిల్లర్(50) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఒకవైపు ఓపెనర్ జమాన్ వికెట్ కాపాడుకుంటూ ఒంటరి పోరాటం చేస్తుండగా మరోవైపు వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్‌లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్(192) పరుగులతో ద్విశతకానికి చేరువలో ఉన్నాడు.
ఇదీ చదవండి:కుర్రాళ్లు.. తొలి అవకాశం అందుకుంటారా?