తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీ క్రికెటర్ డుప్లెసిస్​కు కోపమొచ్చింది..! - Faf du Plessis to miss flight to India: Here's why

టెస్టు సిరీస్​ కోసం భారత్​కు వచ్చేందుకు సిద్ధమైన క్రికెటర్ డుప్లెసిస్.. విమానం ఆలస్యం కావడం వల్ల ​గమ్యానికి చేరుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. సంబంధిత ఎయిర్​లైన్స్​పై ట్విట్టర్​ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

డుప్లెసిస్

By

Published : Sep 21, 2019, 3:33 PM IST

Updated : Oct 1, 2019, 11:31 AM IST

దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సారథి డుప్లెసిస్​కు కోపమొచ్చింది. భారత్​తో టెస్టు సిరీస్​ కోసం వస్తుండగా బ్రిటీష్​ ఎయిర్​లైన్స్​ విమానం ఆలస్యమైంది. గమ్యాన్ని సకాలంలో చేరుకోలేకపోయాడు. అసహనానికి గురైన ఈ క్రికెటర్.. ట్విట్టర్​ వేదికగా ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"నేను దుబాయ్‌ రావడానికి నాలుగు గంటలు ఆలస్యమైంది. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఆలస్యంగా వచ్చింది. ఫలితంగా నేను భారత్‌కు వెళ్లే విమానాన్ని దుబాయ్‌లో అందుకోలేకపోతున్నాను. తదుపరి విమానం 10 గంటల తర్వాత ఉంది." -డుప్లెసిస్, దక్షిణాఫ్రికా ఆటగాడు

మరో ట్వీట్​లో బ్రిటీష్​ ఎయిర్​వేస్​పై విమర్శలు చేశాడీ క్రికెటర్.

"బ్రిటీష్ ఎయిర్​వేస్ నిర్వాకం వల్ల ఇప్పటికీ నా క్రికెట్​ కిట్​ నా దగ్గరికి రాలేదు. ఇదొక చెత్త ప్రయాణ అనుభవం. త్వరలోనే నా బ్యాట్స్​ నా చెంతకు వస్తాయని అనుకుంటున్నా."
-డుప్లెసిస్, దక్షిణాఫ్రికా ఆటగాడు

టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వచ్చే నెల 2న తొలి మ్యాచ్‌ జరగనుంది.విశాఖపట్నం వేదిక కానుంది. ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌లో 1-0తో వెనుకబడ్డ సఫారీలు.. మూడో మ్యాచ్​ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తున్నారు.

ఇవీ చూడండి.. జిమ్​లో టీమిండియా క్రికెటర్ల కసరత్తులు

Last Updated : Oct 1, 2019, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details