తెలంగాణ

telangana

ETV Bharat / sports

మార్పులతో ఇండియా.. పట్టుదలతో విండీస్

భారత్​-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న టీ-20 సిరీస్​ను ఇప్పటికే కైవసం చేసుకుంది టీమిండియా. చివరిదైన మూడో మ్యాచ్​ కోసం కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది.

మ్యాచ్

By

Published : Aug 6, 2019, 5:08 AM IST

ప్రపంచకప్​ ఓటమి తర్వాత వెస్టిండీస్​తో సిరీస్​ను సానుకూలంగా ప్రారంభించింది టీమిండియా. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్​ను​ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గయానా వేదికగా నేడు జరగనుంది. రాత్రి 8 గంటలకు ఆట ఆరంభంకానుంది.

రెండు మ్యాచ్​ల్లో గెలిచి జోరుమీదున్న టీమిండియా.. చివరి టీ20లో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ధోనీ గైర్హాజరుతో జట్టులోకి వచ్చిన పంత్​కు చివరి మ్యాచ్​లో అవకాశం దక్కడం అనుమానమే. ఈ యువ ఆటగాడి స్థానంలో రాహుల్​ను తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్​లో రాహుల్ చాహర్, దీపక్ చాహర్ సోదరులలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.

టీ20ల్లో బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతుంది. జట్టులో బిగ్ ప్లేయర్స్​ పొలార్డ్, బ్రాత్​వైట్ ఆశించినంతగా రాణించలేకపోతున్నారు. వీరిద్దరి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ కోరుకుంటోంది. సిరీస్​ ఓడినా.. ఈ చివరి మ్యాచ్​లో గెలిచి వన్డే సిరీస్​ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలనుకుంటోంది కరేబియన్ జట్టు.

ఇవీ చూడండి.. ధోనీ భద్రతపై ఆందోళన వద్దు: భారత ఆర్మీ ఛీప్

ABOUT THE AUTHOR

...view details